మహానుభావుడు: పరిశుభ్రత పాటించకపోతే తోటి ఉద్యోగిని కొట్టేస్తోన్న శర్వానంద్.. మహానుభావుడు ట్రైలర్ విడుదల
శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మహానుభావుడు’ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో శర్వానంద్ అతిగా పరిశుభ్రత పాటిస్తూ, చేసిన పనినే చేయడం అనే మానసిక వ్యాధితో బాధపడుతోన్న యువకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఓసీడీతో (చాదస్తం లాంటి మానసిక జబ్బు) బాధ పడుతూ శర్వానంద్ చేస్తోన్న పనులు నవ్వు పుట్టిస్తున్నాయి. ఇందులో బురద అంటిన బైకు తనది కాకపోయినా శర్వానంద్ దాన్ని కడిగేస్తున్నాడు. పరిశుభ్రత పాటించకపోతే తోటి ఉద్యోగిని కొట్టేస్తున్నాడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.