కోహ్లీ: ‘కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో’... పాకిస్థాన్ క్రికెట్ అభిమాని పోస్టర్!
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి పాకిస్థాన్‌లో అభిమానులు అధికంగానే ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రపంచ ఎలెవన్ జట్టుతో పాకిస్థాన్ టీ 20 మ్యాచులు ఆడుతోన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా.. కోహ్లీ స్టేడియాన్ని ఊడ్చుతున్నాడని చేసిన వ్యాఖ్యలకి పాక్ అభిమానులు మండిపడ్డారు. ఆ సంఘటనతోనే చెప్పవచ్చు.. కోహ్లీని పాకిస్థానీయులు ఎంతగా ఆరాధిస్తున్నారో. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ కోహ్లీపై చూపిన అభిమానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్ లో మ్యాచ్ జరుగుతుండగా ఆ కానిస్టేబుల్ ఓ పోస్టర్ పట్టుకున్నాడు. అందులో తనను పెళ్లి చేసుకో కోహ్లీ అని రాసి ఉంది. పాక్‌లో జరిగిన ఈ మ్యాచుల్లో కోహ్లీ పాల్గొననందుకు పాక్ అభిమానులు బాధపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ నిరాశను వ్యక్తపరుస్తున్నారు. ధోనీ అంటే కూడా పాక్ అభిమానులకు చాలా ఇష్టం.