నాగార్జున: ‘వెండితెర‌ పుట్టిన‌ప్పుడు అలా అనుకుందట..’ అంటూ బాహుబ‌లిని పొగిడేసిన నాగార్జున!

  • అక్కినేని జాతీయ పురస్కారం స్వీక‌రించినందుకు రాజ‌మౌళికి ధ‌న్య‌వాదాలు
  • వెంక‌య్య నాయుడిని పదవులు వెతుక్కుంటూ వస్తాయి
  • తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌నం కోసం ఆలోచించే మ‌నిషి

‘వెండితెర పుట్టిన‌ప్పుడు అనుకుంద‌ట, తాను బాహుబ‌లి సినిమాను ప్ర‌ద‌ర్శించ‌డానికే పుట్టాన‌ని, బాహుబ‌లి సినిమా రావ‌డంతో అది పుల‌క‌రించింద‌ట’ అంటూ ఓ ద‌ర్శ‌కుడు ఓ క‌విత రాసి తనకు చెప్పాడ‌ని అక్కినేని నాగార్జున అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కారాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి అందించిన త‌రువాత నాగార్జున‌ మాట్లాడుతూ... రాజ‌మౌళి అద్భుత సినిమా తీశాడ‌ని అన్నారు. అక్కినేని జాతీయ పురస్కారం స్వీక‌రించినందుకు రాజ‌మౌళికి ధ‌న్య‌వాదాలు చెప్పారు

వెంక‌య్య నాయుడు కాలేజీ వ‌య‌సులోనే ఉద్య‌మాల్లో జాయిన్ అయ్యారని, స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్ట్ ద్వారా సేవ‌లు అందిస్తున్నారని, ప‌ద‌వులు ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌స్తాయని నాగార్జున అన్నారు. ఇప్పుడు ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విలో ఉన్నార‌ని, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు తాను కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాన‌ని అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జ‌నం కోసం ఆలోచించే మ‌నిషని, ప్ర‌జ‌ల‌కి ఏం కావాలో ఆయ‌న‌కు తెలుసని నాగార్జున అన్నారు. ప్ర‌జ‌ల కోసం మిష‌న్ భ‌గీర‌థ‌, రెండు ప‌డ‌క గ‌దుల ఇళ్లు, మిష‌న్ కాక‌తీయ వంటి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌ని అన్నారు. ఈ రోజు ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చినందుకు వారికి కృత‌జ్ఞ‌తలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News