: 'అమ్మహస్తం' ద్వారా 18 సరుకులు
'అమ్మహస్తం' పథకం ద్వారా త్వరలో 18 సరుకులు అందిస్తామని కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్పారు. ఇటీవలే రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కారు రూ. 185 కే 9 వస్తువులు అందిస్తోన్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో కేంద్ర మంత్రి నేడు 'అమ్మహస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నారు. ఇక ఇందిరమ్మ లబ్దిదారులకు రూ. లక్ష రుణ సహాయం అందిస్తామని తెలిపారు.