: మహేశ్ బాబు కూతురిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అలరించిన రకుల్ ప్రీత్ సింగ్.. మీరూ చూడండి!
మహేశ్ బాబు ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోన్న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక ప్రాంగణానికి ఆ సినిమా నటులంతా చేరుకున్నారు. మహేశ్‌బాబు తన భార్యాపిల్లలతో పాటు వచ్చాడు. ఆయన రాగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విజిల్స్ వేస్తూ హోరెత్తించారు.
ఈ ఈవెంట్‌కి కృష్ణ, విజయ నిర్మల కూడా వచ్చారు. కాగా, ఈ వేడుకలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. మహేశ్ బాబు కూతురు సితారని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ పక్కన ఉన్న సీట్‌లోనే మహేశ్ బాబు కుమారుడు కూడా కూర్చున్నాడు. మహేశ్ కూతురిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని రకుల్ ఇచ్చిన పోజు అభిమానులను అలరిస్తోంది.