: రోహింగ్యా ప్రజల అతి దారుణ పరిస్థితులపై యూనిసెఫ్, అమ్నెస్టీ ప్రకటన
- 20 రోజుల్లో దాదాపు 2,40,000 మంది రోహింగ్యా చిన్నారుల వలస
- ఇప్పటివరకు 60 శాతం మంది రోహింగ్యాలు ఇతర ప్రాంతాలకు
- ఒక క్రమపద్ధతిలో దాడులు
- ఇంత భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన ప్రజలు వలస వెళ్లడం ఇదే తొలిసారి
మయన్మార్ నుంచి రోహింగ్యాలను తరిమేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్.. ఆ ప్రాంత చిన్నారుల వివరాలను తెలిపింది. 20 రోజుల్లో దాదాపు 2,40,000 మంది రోహింగ్యా చిన్నారులు బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు పేర్కొంది. ఇక ఇప్పటివరకు 60 శాతం మంది రోహింగ్యాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపింది. వారిలో గర్భవతుల సంఖ్య 52 వేలని చెప్పింది.
అలాగే రోహింగ్యాల పరిస్థితులను పరిశీలించిన ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ.. రోహింగ్యాలపై సైన్యం ఒక క్రమపద్ధతిలో దాడులు చేస్తోందని తెలిపింది. ఇంతటి భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన ప్రజలు వలస వెళ్లడం ఇదే మొట్టమొదటిసారి కావచ్చని అభిప్రాయపడింది. ఆయా ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది.