: కొరియన్ సూపర్ సిరీస్‌లో దూసుకుపోతున్న పీవీ సింధు!
- క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణిపై గెలుపు
- సెమీ ఫైనల్స్‌లో స్థానం
- సెమీస్ గెలిస్తే మళ్లీ నోజోమీతో తలపడే అవకాశం
సియోల్‌లో జరుగుతున్న కొరియన్ సూపర్ సిరీస్‌లో తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన హవా కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన మినట్సు మిటానిని 21-19, 18-21, 21-10 తేడాతో ఓడించి, సెమీ ఫైనల్స్‌లో సింధు తన స్థానం ఖరారు చేసుకుంది. సంగ్ జీ హ్యూన్, హి బింగ్‌జియావోల క్వార్టర్ మ్యాచ్‌లో గెలిచిన వారితో సింధు సెమీస్‌లో తలపడనుంది. ఒకవేళ సింధు సెమీస్‌లో గెలిస్తే, ఇప్పటికే సెమీస్ స్థానం సంపాదించుకున్న నోజోమీ ఒకుహారా, అకానే యమగూచితో ఆడి, ఆమె కూడా సెమీస్ గెలిస్తే నోజోమీ, సింధులు ఫైనల్లో పోటీ పడే అవకాశం ఉంది. ఇటీవల గ్లాస్కోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో నోజోమీ, సింధులు బంగారు పతకం కోసం తలపడ్డారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో నోజోమీ గెలవడంతో, సింధు వెండి పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.