: హైదరాబాద్ లో చీపురు పట్టిన అక్కినేని అమల

  • స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న అమల
  • కాలనీ వాసులతో కలసి రహదారులు శుభ్రం
  • చిన్నారులకు పాఠశాల నుంచే శుభ్రతపై అవగాహన కల్పించాలన్న అమల

స్వచ్ఛ భారత్ లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో అక్కినేని అమల చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. హైదరాబాద్ లోని మియాపూర్ జనప్రియ పశ్చిమ నగరంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో కలిసి ఆమె రోడ్లు శుభ్రం చేశారు. కాలనీ వాసులతో కలసి గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. స్వయంగా మట్టి, కంకరతో గుంతలను నింపారు. ఆపై జరిగిన ఓ సభలో పారిశుద్ధ్య కార్మికులకు రేడియం జాకెట్లు, చేతులకు వేసుకునేందుకు గ్లౌజులు అందజేశారు. ఆపై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే శుభ్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News