: ట్విట్టర్‌లో 20 లక్షలు దాటిన పవన్ కల్యాణ్ ఫాలోవర్ల సంఖ్య... కృతజ్ఞతలు చెప్పిన పవర్ స్టార్!
సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ ఫాలోవర్ల సంఖ్య 20,00,000 దాటింది. ఈ సందర్భంగా తన అభిమానులకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. `మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టినపుడు... దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచంగా.... ఒకే గొంతుకతో మొదలు పెట్టాను, నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతిస్పందించి, ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో... మీ పవన్ కళ్యాణ్...` అని ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన గంటలోనే దీనికి 6వేలకి పైగా లైకులు, 2500ల రీట్వీట్లు వచ్చాయి. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో పవన్ ఐదో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో మహేశ్ బాబు, రెండో స్థానంలో సిద్ధార్థ్, మూడో స్థానంలో రానా, నాలుగో స్థానంలో నాగార్జున ఉన్నారు.