: మళ్లీ రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం!
* నేటి తెల్లవారుజామున మరో క్షిపణి ప్రయోగం
* ఈ నెలలో ఇది రెండో క్షిపణి ప్రయోగం
* అమెరికా, ఐరాస హెచ్చరికల బేఖాతరు
* ఇక ఉపేక్షించేది లేదన్న జపాన్ ప్రధాని
ఉత్తర కొరియా మరోమారు రెచ్చిపోయింది. అమెరికా, ఐరాస హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. నేటి తెల్లవారుజామున మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. అది జపాన్ మీదుగా ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. అణ్వస్త్రాలతో జపాన్ ను ముంచేస్తామని హెచ్చరించిన మరుసటి రోజే, ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షకు దిగడం గమనార్హం.
కాగా, ఈ నెలలో ఇది రెండో క్షిపణి ప్రయోగం. మూడు వారాల క్రితం కూడా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. కిమ్ జోంగ్ తాజా చర్యతో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐరాస ఆంక్షలు కిమ్ జోంగ్‌ను ఏమాత్రం నిలువరించలేకపోతున్నాయి. రెచ్చ గొట్టే చర్యలను ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగంపై జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.