: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు తృటిలో తప్పిన ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆటోను ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని పినపాకపట్టి నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.