: విద్యాబాలన్ రేడియో జాకీగా నటిస్తున్న కొత్త సినిమా టీజర్ అదుర్స్!
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘తుమారీ సులు’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు సులోచన అనే లేట్ నైట్ రేడియో జాకీ పాత్రలో కనపడనుంది. కాగా, ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు. ఐ యాం ఆర్జే సులు అంటూ విద్యాబాలన్ రేడియో జాకీలా మాట్లాడేస్తోంది. ఇందులో వినిపించిన ఆమె స్వరం అద్భుతంగా ఉంది. రేడియోలో పనిచేస్తూనే సాధారణ గృహిణి పాత్రలో ఈమె కనపడుతోంది. ఈ సినిమాని కేవలం 42 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ టీజర్‌లో విద్యాబాలన్ మాటతీరు అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు.