: హ్యాక్‌కు గురైన ర్యాన్ గ్రూప్ వెబ్‌సైట్‌... చిన్నారి ప్ర‌ద్యుమ‌న్‌కి నివాళి అర్పించిన హ్యాక‌ర్లు


పాఠ‌శాల నిర్ల‌క్ష్యం కార‌ణంగా అసువులు బాసిన చిన్నారి ప్ర‌ద్యుమ‌న్ ఠాకూర్‌కి హ్యాక‌ర్లు నివాళి అర్పించారు. ర్యాన్ స్కూల్స్‌కి సంబంధించిన ర్యాన్ గ్రూప్ వెబ్‌సైట్‌ని వారు హ్యాక్ చేశారు. `టీం కేర‌ళ సైబ‌ర్ వారియ‌ర్స్‌`గా హ్య‌క‌ర్లు త‌మ‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. గుర్గావ్‌లోని ర్యాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌లో హ‌త్య‌కు గురైన ప్ర‌ద్యుమ‌న్ ఠాకూర్ ఫొటోను వారు వెబ్‌సైట్ హోం పేజీలో కనిపించేలా ఉంచారు. ఆ ఫొటో కింద `నువ్వు వెళ్లిపోయి ఉండొచ్చు. కానీ నిన్ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోం` అనే సందేశాన్ని హ్యాక‌ర్లు ఉంచారు.

అలాగే ర్యాన్ స్కూల్ యాజ‌మాన్యాన్ని నిలదీస్తూ ఓ సందేశాన్ని కూడా హ్యాక‌ర్లు అందించారు. `విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో మీరు చూపించిన నిర్ల‌క్ష్యం వ‌ల్ల చ‌నిపోయిన విద్యార్థికి మీరు చేయ‌గ‌ల న్యాయం ఏంటని భార‌త ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. విద్య అనేది మీకు వ్యాపారం కావొచ్చు. విద్యార్థుల ర‌క్ష‌ణ కోసం మీరు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు ఏంటి?` అని హ్యాక‌ర్లు సందేశంలో అడిగారు. అలాగే ప‌నిచేయ‌ని సీసీ కెమెరాలు, ఉద్యోగం ఇచ్చేముందు అభ్య‌ర్థుల నేప‌థ్యం ఆరా తీయ‌క‌పోవ‌డం, డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్ల‌ని పాఠ‌శాల లోప‌లికి అనుమతివ్వడం, పిల్ల‌ల వాష్ రూంల‌ను ఇత‌రుల‌ను వాడుకోనివ్వ‌డం.. వంటి ప‌నులను హ్యాక‌ర్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News