: నల్గొండలో మటన్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ!


నల్గొండలో మటన్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మటన్ మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి ఈ రోజు ప్రారంభించారు. అయితే, టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆహ్వానించలేదంటూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శిలాఫలకాన్ని ధ్వంసం చేసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. కాగా, నల్లొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News