: అక్రమంగా మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఇండియా.. భారత్ కు అమెరికా షాక్!


భారత్ తో ఓ వైపు స్నేహం కోసం ఆరాటపడుతూనే, మరోవైపు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్రమంగా మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఇండియాను కూడా చేర్చారు. మత్తు పదార్థాలను ఉత్పత్తి చేసి, రవాణా చేసే 21 దేశాల జాబితాలో భారత్ ను కూడా చేర్చారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తక్కువ స్థాయిలో డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటోందని చెప్పారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లు ఎక్కువ స్థాయిలో డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయిని పేర్కొన్నారు.

ఈ జాబితాలో కొలంబియా, కోస్టారికా, బొలీవియా, బెలిజ్, బహమాస్, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, హైతీ, గ్వాటెమాలా, జమైకా, హోండురస్, నికరాగ్వా, మెక్సికో, పెరూ, పనామా, వెనెజువెలా తదితర దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాల నైసర్గిక స్వరూపం డ్రగ్స్ ను ఉత్పత్తి చేయడానికి, రవాణా చేయడానికి అనుకూలంగా ఉందని...అందువల్లే ఈ దేశాలను జాబితాలో చేర్చామని చెప్పారు. 

  • Loading...

More Telugu News