: తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన!


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, మెదక్, జనగాం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News