: కేంద్రం కీలక నిర్ణయం.. చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత పౌరసత్వం!


భారత్‌లో ఉంటున్న చక్మా, హజోంగ్ శరణార్థుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి భారత పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది. 1960లలో తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి దాదాపు 5 వేల మంది అరుణాచల్ ప్రదేశ్‌కు వలస వచ్చారు. అయితే ఇప్పుడు వీరి సంఖ్య లక్షకు  పైగానే ఉంది.  వీరిలో చక్మాలు బౌద్ధులు కాగా, హజోంగ్‌లు హిందువులు. వీరికి పౌరసత్వం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా.. అదే సమయంలో దాని వల్ల స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా చూడాలని యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.

  • Loading...

More Telugu News