: కంచ ఐలయ్య వివాదం: చంద్రబాబును కలసిన ఆర్యవైశ్య ప్రముఖులు


రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబును వారు కలిశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని కోరారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ పుస్తకాన్ని నిషేధించాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఆందోళనలు చేస్తున్నారు. కంచ ఐలయ్య మేధావి అయినంత మాత్రాన ఓ కులాన్ని కించపరిచే విధంగా రాయడం సబబు కాదని అంటున్నారు.

  • Loading...

More Telugu News