: సెన్సెక్స్ కు లాభాలు.. నిఫ్టీకి నష్టాలు!


భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఉదయం 50 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్... ఒకానొక దశలో 120కి పైగా పాయింట్ల లాభంలోకి వెళ్లింది. అయితే, చివరకు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో స్వల్ప లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 32,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,079 పాయింట్ల వద్ద స్థిర పడింది. సన్ ఫార్మా, టాటా పవర్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లాభపడ్డాయి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐటీసీ లిమిటెడ్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. 

  • Loading...

More Telugu News