: పది రోజుల షూటింగ్ కోసం రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసిన మాధవన్!
`ఫ్యానీ ఖాన్` చిత్రంలో ఐశ్వర్య రాయ్‌తో మాధవన్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే కొన్ని రోజులకే ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిసింది. దీనికి కారణం మాధవన్ భారీ పారితోషికం అడగటమేనని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో మ్యాడీ పాత్రకు కేవలం పది రోజుల డేట్లు కావాలని చిత్ర నిర్మాతలు అడిగారట. కానీ ఈ పది రోజుల షూటింగ్ కోసం మ్యాడీ రూ. 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి చిత్ర బృందం ఒప్పుకోలేదు. మ్యాడీ కూడా రాజీ పడలేదు. దీంతో ఆ పాత్ర రాజ్‌కుమార్ రావ్‌ను వరించిందని వారు చెబుతున్నారు. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన లుక్‌ను అనిల్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.