: స్వల్ప అస్వస్థతకు గురయ్యా.. ప్రస్తుతం బాగానే ఉన్నా: హీరోయిన్ షాలినీ పాండే


‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరోయిన్ షాలినీ పాండే ఈ రోజు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన షాలిని అస్వస్థతకు గురవడంతో, వెంటనే సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, కొంచెం సేపటి తర్వాత డిశ్చార్జి చేశారు. అయితే, షాలిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ఆమెకు ఫోన్లు చేసి పరామర్శించడం.. ఈ నేపథ్యంలో షాలిని స్పందించింది.

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో మాట్లాడుతూ, తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని చెప్పింది. కొద్దిగా తలనొప్పి, జ్వరం కారణంగా అస్వస్థతకు గురయ్యానని చెప్పింది. తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానంటూ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదని ఈ సందర్భంగా షాలిని పాండే స్పష్టం చేసింది. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు, తన కొత్త సినిమా ప్రాజెక్ట్ లను త్వరలోనే వెల్లడిస్తానని షాలిని తెలిపింది. 

  • Loading...

More Telugu News