: నా అందానికి కారణం ఇదే!: గుత్తా జ్వాల


బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆటతోనే కాకుండా, అందంతో కూడా అభిమానులను కట్టిపడేస్తుంది జ్వాల. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి నుంచి 'మీ అందానికి రహస్యం ఏమిటి' అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి సమాధానంగా తనకు బ్యూటీ టిప్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని... తన తల్లి చైనీస్ అని, తన తండ్రి తెలుగు వ్యక్తి అని... తాను హైబ్రీడ్ అని చెప్పింది. తన అందానికి ఇదే కారణమని చెప్పింది.

 'దాన్ ఉత్సవ్' ఫండ్ రైజర్ ఈవెంట్ లో జ్వాల పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. తాను ఎప్పట్నుంచో సేవా కార్యక్రమాలను చేస్తున్నానని... కేవలం ఆత్మ సంతృప్తి కోసమే సోషల్ సర్వీస్ చేస్తున్నానని... ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది.

  • Loading...

More Telugu News