: మ్యూజిక్ వీడియో ద్వారా బాలీవుడ్‌పై వ్యంగ్యాస్త్రాలు కురిపించిన కంగనా రనౌత్... మీరూ చూడండి!
ఇటీవల `ఆప్ కీ అదాలత్` కార్యక్రమంలో బాలీవుడ్ గురించి బల్లగుద్ది మరీ నిజాలు చెప్పిన కంగనా రనౌత్‌పై బాలీవుడ్ ప్రముఖులు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అది మర్చిపోకముందే ఆమె మరో బాంబు పేల్చింది. బాలీవుడ్‌లో ఉన్న లోటుపాట్లపై, హిందీ సినిమాల విధివిధానాల గురించి తెలియజేస్తూ ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది.
ఏఐబీ కామెడీ గ్రూప్ సహాయంతో ఆమె ఈ వీడియో రూపొందించింది. ఇందులో బాలీవుడ్‌లో ఉండే ఐటమ్ సాంగ్స్ లిరిక్స్, కథ విషయంలో హీరోయిన్ సలహాలకు, హీరో సలహాలకు దర్శకులు ఇచ్చే ప్రాధాన్యత, హీరోయిన్ పాత్ర తీరుతెన్నులు, హీరోయిన్ వ్యక్తిగత జీవితంతో మీడియా వేసే వెకిలి వేషాలు, పారితోషికం విషయంలో చూపించే వివక్ష, వయసులో పెద్ద వాళ్లైన హీరోల సరసన చిన్న వయసు హీరోయిన్లను తీసుకోవడం, కెరీర్ అయిపోయిన హీరోయిన్లు సబ్బులు, డిటర్జెంట్ల ప్రకటనలు చేయడం, నటనను వారసత్వం చేయడం వంటి చాలా విషయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పాట చిత్రీకరణ కూడా కరణ్ జొహార్ సినిమాను తలపించేలా తీశారు. అయితే ఈ వీడియో చేయడంపై కంగనాను చాలా మంది ప్రశంసిస్తున్నారు.