: కేసీఆర్ ను తెలంగాణ గాంధీగా అభివర్ణించిన హీరో మంచు మనోజ్
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ నిర్ణయం పట్ల టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు. "మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు.