: అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలినీ పాండేకు అస్వస్థత... హుటాహుటిన బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలింపు!


ఇటీవలి సూపర్ హిట్ చిత్రం 'అర్జున్ రెడ్డి'లో హీరోయిన్ గా నటించి యువతలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శాలినీ పాండే కొద్దిసేపటి క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ సెల్ ఫోన్ షాపును ప్రారంభించడానికి శాలిని నెల్లూరు రాగా, కార్యక్రమం మధ్యలో ఆమె హఠాత్తుగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఆమెను లేపేందుకు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో, హుటాహుటిన బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆంబులెన్స్ లో తరలించారు.

అంబులెన్స్ నుంచి సైతం దిగేందుకు ఆమె శరీరం సహకరించకపోవడంతో, స్టెచ్చర్ పై ఆమెను ఆసుపత్రి లోపలికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శాలినీకి ఏమైందన్న విషయమై పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News