: వందలాది సినిమాలను రిలీజ్ రోజే చూపించిన 'తమిళ్ రాకర్స్' కటకటాల వెనక్కు!
తెలుగు, తమిళం, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్... ఏ సినిమా అయినా, రిలీజ్ అయిన రోజే పైరసీ చేయడంలో దిట్టయిన 'తమిళ్ రాకర్స్' వెబ్ సైట్ నిర్వాహకులను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. గత మూడేళ్లుగా వందలాది సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్ లో పెట్టి చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించిన 'తమిళ్ రాకర్స్' అడ్మిన్ గౌరీ శంకర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇతను మూడో కీలక నిందితుడని, మిగతా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అందరినీ అరెస్ట్ చేసిన తరువాత మాత్రమే వెబ్ సైట్ ను పూర్తిగా మూసివేయగలమని అన్నారు. కాగా, ఈ వెబ్ సైట్ ను మూసి వేయాలని నడిగర సంఘం ప్రెసిడెంట్, హీరో విశాల్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.