: ల్యాండ్ అవుతూ.. ట్యాక్సీ వే లోకి దూసుకెళ్లిన విమానం!


జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం గౌహతి నుంచి జోర్హాట్ కు బయలుదేరింది. అనంతరం అక్కడ ల్యాండ్ అవుతుండగా, అదుపు తప్పి ట్యాక్సీ వేలోకి దూసుకెళ్లి దిగబడిపోయింది. విమానానికి చెందిన ఓ చక్రం మట్టిలోకి దిగబడిపోయింది. దీంతో, విమానాన్ని అక్కడే నిలిపివేసి, ప్రయాణికులను అక్కడ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ ట్వీట్ చేసింది. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా... దీనిపై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. 

  • Loading...

More Telugu News