: సాయికిరణ్ ఇంట్లో రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం!
తనను నమ్మి వచ్చిన స్నేహితురాలు చాందినీ జైన్ ను దారుణంగా హత్యచేసిన సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆమెను అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకు వెళ్లిన సాయికిరణ్, బలంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు సాయికిరణ్ ఇంట్లో తనిఖీలు చేయగా రక్తపు మరకలు ఉన్న దుస్తులు కనిపించాయి. మదీనాగూడలోని ఓ అపార్టుమెంట్ లో సాయికిరణ్ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో లభ్యమైన దుస్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సాయికిరణ్ ను నమ్మిన చాందినీ స్వయంగా అతనితో కలిసి గుట్టల్లోకి వెళ్లిందని, అక్కడే హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఆమె ఫోన్ ను చెరువులో పడేసినట్టు సాయికిరణ్ వెల్లడించాడని సమాచారం.