: అందుకే, ‘సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు’ అనే టైటిల్ పెట్టాను: కంచ ఐలయ్య ప్రెస్మీట్
‘సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు’ అని టైటిల్ పెట్టి పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో తన పుస్తకంపై వివరణ ఇచ్చారు. వాక్ స్వాతంత్ర్యాన్ని బతికించడం కోసం పోరాడాల్సి ఉందని అన్నారు. ఆర్యవైశ్యులకు సమాజంలో ఎంతో స్వేచ్ఛ ఉందని, దళితులు, బీసీలకు మాత్రం లేదని అన్నారు. దేశంలో టీమాస్ ప్రొటెస్ట్ చేసుకుంటామంటే అనుమతి ఇవ్వరని, అదే అగ్రకులాల వారు పోరాటం చేసుకుంటామంటే అనుమతి ఎలా ఇస్తున్నారని అన్నారు. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు అని రాయడానికి ఓ కారణం ఉందని అన్నారు. కొమటోళ్లు కింది కులాలు తయారు చేసిన ఉత్పత్తులను అతి తక్కువ ధరకు తీసుకుని, తిరిగి వారికే ఎక్కువ ధరకు అమ్ముకునేవారని కంచ ఐలయ్య అన్నారు. అందుకే తాను ఆ టైటిల్ పెట్టానని వివరణ ఇచ్చారు.