: దుల్కర్ సల్మాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసిన రీతూ వర్మ!
`పెళ్లి చూపులు` సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న రీతూ వర్మ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా సెలక్టివ్‌గా వ్యవహరిస్తోంది. కథ, హీరో వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమె సినిమాలను ఎంచుకుంటోంది. అదే దారిలో ఇప్పుడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు రీతూ స్పష్టం చేసింది. మలయాళంతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో దుల్కర్ నటిస్తుంటాడు. తెలుగులో దుల్కర్ నటించిన `ఓకే బంగారం` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రీతూ, దుల్కర్ నటించనున్న సినిమాకు దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం రీతూ వర్మ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ సరసన `ధ్రువనక్షత్రం` సినిమాలో నటిస్తోంది.