: ఫ్లాష్ బ్యాక్... సినిమా కోసం జూనియర్ ఆర్టిస్టులను చంపేశారు???


సినిమాల్లో క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్లు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఉండేవి... ఈ ఫైట్లలో నటీనటులు గాయపడడం సర్వసాధారణం. కానీ ఒక సినిమా క్లైమాక్స్ కోసం జూనియర్ ఆర్టిస్టులను చంపేసిన ఘటన 1941లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...1941లో ‘మీన్‌ లెబెన్‌ ఫర్‌ ఐర్లాండ్‌’ సినిమా విడుదలైంది. ఈ సినిమా క్లైమాక్స్ లో బాంబు పేలుడుతో జనాలు మృతిచెందాల్సి ఉంటుంది. దీనిని చిత్రీకరించేందుకు జూనియర్ ఆర్టిస్టులను లొకేషన్ కు తీసుకొచ్చారు. వారికి నటించాల్సిన షాట్ ను వివరించారు. అంతకు ముందే ఆ ప్రాంతంలో నిజమైన బాంబులను చిత్రబృందం అమర్చింది. 'యాక్షన్' చెప్పగానే జూనియర్ ఆర్టిస్టులు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా భూమిలో అమర్చిన మందుపాతరలు పేలడంతో గాల్లోకి లేచి చిన్నాభిన్నమైపోయారు. ఈ సన్నివేశాలను అలాగే సినిమాలో ఉంచి ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News