: అబ్బాయిలూ! ఇలా ప్రేమించండి... దీపికా పదుకునే ప్రేమ పాఠాలు!


దీపికా పదుకునే ప్రేమ పాఠాలు చెబుతోంది. మోస్ట్ డిజైరబుల్ ఉమన్ కంటెస్ట్ లో తొలివరుసలో ఉండే దీపికా పదుకునే మాట్లాడుతూ, కంటి చూపుతో వేల మాటల్ని చెప్పవచ్చని తెలిపింది. కంటి చూపును మించిన భాష మరొకటి లేదని చెప్పింది. అయితే మనసులో మాట బయటపెట్టేందుకు తొందర పడవద్దని చెప్పిన దీపికా, ఆలస్యం చేయడం కూడా మంచిది కాదని సూచించింది. అయితే ప్రేమించిన వ్యక్తిపై భావాలను వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యమని తెలిపింది. అలాగని అతిగా పొగడవద్దని సూచించింది.

అతి పొగడ్తలు మొదటికే మోసమని హెచ్చరించింది. పొగడ్తలో నిజాయతీ ఉండాలని సూచించింది. ఈ పొగడ్త నిజమేకదా అనిపించాలని తెలిపింది. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎప్పుడూ అగ్నిలా రగులుతుండాలని సూచించింది. భాగస్వామిని నిత్యం ఉత్సాహంగా ఉంచాలని సూచించింది. జీవితం ఎప్పుడూ కొత్తగా ఉండడానికి కావాల్సినవన్నీ చేస్తుండాలని చెప్పింది. ఒకసారి ఒక వ్యక్తి ప్రేమ నుంచి దూరమైతే దానిని మనసులోంచి పూర్తిగా తీసెయ్యాలని దీపిక తెలిపింది. ఆ తరువాత మరోవ్యక్తితో రిలేషన్ షిప్ లోకి వెళ్లినా నిజాయతీగా ఉంటుందని సూచించింది. 

  • Loading...

More Telugu News