: బ్యాడ్మింట‌న్‌లో మొదటి జీవిత సాఫ‌ల్య పుర‌స్కార విజేత‌ ప్ర‌కాశ్ ప‌దుకొనే... ప్ర‌క‌టించిన బీఏఐ!


బ్యాడ్మింట‌న్ ఆట అభివృద్ధి కోసం ప్ర‌కాశ్ ప‌దుకొనే చేసిన కృషికి ఫ‌లితంగా ఆయ‌న‌ను మొద‌టి జీవిత సాఫ‌ల్య పుర‌స్కార విజేత‌గా ఎంపిక చేసిన‌ట్లు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఆయ‌న‌కు జ్ఞాపికతో పాటు రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి కూడా అంద‌జేయ‌నున్న‌ట్లు బీఏఐ అధ్య‌క్షుడు హిమంతా బిస్వా శ‌ర్మ తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్ర‌తి ఏడాది బ్యాడ్మింట‌న్ అభివృద్ధి కోసం పాటుప‌డిన వారికి జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అంద‌జేయాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లో న్యూఢిల్లీలో వేడుక ఏర్పాటు చేసి ప్ర‌కాశ్ ప‌దుకొనేకి స‌న్మానం చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. 1980లో ఆల్ ఇంగ్లండ్‌, 1983లో ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌, 1978లో కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ప్ర‌కాశ్ ప‌దుకొనే ప‌త‌కాలు గెల్చుకున్నారు. అలాగే 1972లో అర్జున అవార్డు, 1982లో ప‌ద్మ‌శ్రీ అందుకున్నారు.

  • Loading...

More Telugu News