: శశికళ బర్తరఫ్... కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అన్నాడీఎంకే
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వీకే శశికళను తొలగిస్తూ అన్నాడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం నుంచి జరుగుతున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెపై చర్చించిన పార్టీ, తక్షణం అమల్లోకి వచ్చేలా శశికళను బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అమ్మ, దివంగత జయలలిత స్వయంగా పదవుల్లో నియమించిన వారిని ప్రస్తుతానికి కొనసాగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.
రెండాకుల గుర్తు తమకే చెందుతుందని మరో తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. ఆపై సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు, వివిధ పార్టీ పదవులను అనుభవిస్తున్నవారు హాజరయ్యారు.