: బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్!


తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఈ నెల 17వ తేదీన వారు భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలోని అంతర్గత సమస్యలు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్న విభేదాల వల్లే వీరు పార్టీ మారుతున్నారు. గతంలో వీరు టీఆర్ఎస్ లోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వీరు బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు, కోమటిరెడ్డి సోదరులు తమ పార్టీలోకి వస్తే, తెలంగాణలో పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ కీలక నేతలు కూడా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News