: హనీమూన్ పిక్ ను షేర్ చేసుకున్న రియా సేన్... చూడండి!
సుదీర్ఘకాల బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీని ఇటీవలే వివాహం చేసుకున్న నటి రియా సేన్, తమ హనీమూన్ కోసం ప్రేగ్ నగరాన్ని ఎంచుకుంది. భర్తతో కలసి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో ఆనందంగా గడుపుతున్న రియా, తన మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంది. ఇక ఓ హోటల్ లో వీరిద్దరూ కూర్చున్న వేళ, భర్త పెదవులను ప్రేమగా అందుకున్న రియా సేన్, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా, అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఎంతో మంది 'నో... డోంట్ కిస్ హిమ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత నెలలో మెంగాలీ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రియా సేన్ షేర్ చేసుకున్న ఫోటోను మీరూ చూడవచ్చు.