: కాసేపట్లో అన్నాడీఎంకేలో కీలక మార్పు... భారీ బందోబస్తు నడుమ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం


కాసేపట్లో అన్నాడీఎంకేలో కీలకమైన మార్పు చోటుచేసుకోనుంది. అన్నాడీఎంకే సర్వసభ్యసమావేశం చెన్నయ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను పార్టీ నుంచి బహిష్కరించనున్నారు. అనంతరం ఆ స్థానంలో పన్నీరు సెల్వంను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాన్ని కూలుస్తానని టీటీవీ దినకరన్ సవాలు విసురుతున్నారు.

ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం తమిళనాట సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News