: అమెరికా చరిత్రలో గుర్తిండిపోయేలా దాడి చేస్తాం : ఉత్తరకొరియా తీవ్ర హెచ్చరికలు
వరుసగా అణుపరీక్షలు నిర్వహిస్తూ, ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి మరిన్ని కఠినమైన అంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు భద్రతా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు అమెరికన్ మీడియా చెబుతోంది. దీనిపై ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించింది. తమపై కక్షగడితే ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని చెప్పింది.
అమెరికా నాటకానికి ఐక్యరాజ్యసమితి వంత పాడటం మొదలుపెట్టిందని విమర్శించింది. అమెరికాపై ఉత్తరకొరియా దాడి చేసి తీరుతుందని, ఆ దాడి యావత్ప్రపంచం చర్చించుకునేలా ఉంటుందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తమ దేశ ఎగుమతులపై నిషేధం విధించిందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా తమ అధ్యక్షుడి ఆస్తులు స్తంభించేలా చేసేందుకు ప్రయత్నించడం, తమ దేశ కార్మికులను విదేశాల్లోని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఒత్తిడి తేవడంపై ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.