: పోలీసులకు ఉచిత సలహా ఇచ్చిన అత్యాచార నిందితుడు!


దేశ రాజధానిలోని ఒక పాఠశాలలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అదే స్కూల్ కు చెందిన ప్యూన్ వికాస్ (40) ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతనిని విచారించిన సందర్భంగా పోలీసులకు దిమ్మదిరిగే సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది.

విచారణ సందర్భంగా వికాస్‌ ని పోలీసులు ‘నీకు తాగే అలవాటుందా?’ అని ప్రశ్నించగా, ‘అవును. రోజుకి క్వార్టర్‌ తాగుతా. అయితే ఏంటి? అయినా నేను ఆ బాలికపై అత్యాచారం చేయలేదు. పాఠశాల మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్‌ సాయంతో నిందితుడిని కనిపెట్టాలి’ అంటూ సూచించాడని వారు తెలిపారు. నిందితుడి వివరాలను బాధిత బాలిక పోలీసులకు చెప్పడంతో వికాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యాయవిచారణకు ఆదేశించారు. 

  • Loading...

More Telugu News