: భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. ఈ నెల 14న శంకుస్థాపన
భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14న భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబె శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు. సుమారు ఒక లక్షా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని, మహారాష్ట్ర, గుజరాత్ లో హైస్పీడ్ ట్రాక్, 21 కిలోమీటర్ల టన్నెల్స్ కూడా ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొంది.