: సీఎం కేసీఆర్ ను కలిసిన అక్కినేని నాగార్జున
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే కంటికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను చూడడానికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు.