: మేము ముగ్గురం వ్యక్తిగతంగానే కలిశాం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాక, చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ, ‘మేము ముగ్గురం వ్యక్తిగతంగానే సమావేశమయ్యాం. మా భేటీని రాజకీయ కోణంలో చూడొద్దు’ అని అన్నారు.