: స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ.. కుంటలో ప‌డి ప్రాణాలు కోల్పోయిన ఇంజ‌నీరింగ్ విద్యార్థి


సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించి మేడ్చ‌ల్‌లోని శామీర్‌పేట మండలం మజీద్‌పురాలోని హనుమండ్లకుంటలో ప‌డి ఓ ఇంజ‌నీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని స్థానికుల సాయంతో ఆ విద్యార్థి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ క‌ళాశాల‌కు చెందిన కొంతమంది విద్యార్థులు హనుమండ్లకుంట వచ్చార‌ని, వారు అక్క‌డ సెల్ఫీలు తీసుకుంటుండ‌గా ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోయాడ‌ని పోలీసులు తెలిపారు. మృతుడి వివ‌రాల గురించి తెలియాల్సి ఉంది.       

  • Loading...

More Telugu News