: కంచ ఐలయ్య పుస్తకంపై స్పందించిన మాజీ గవర్నర్ రోశయ్య
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై ఆర్యవైశ్యులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య స్పందించారు. ఈ పుస్తకంలోని అభ్యంతరాలపై ఐలయ్యతో ఆర్యవైశ్యులు చర్చించాలని, ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పుస్తకాలు రాయడం మంచిది కాదని అన్నారు. సంస్కృతి పరంగా సామాజికవర్గ ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. వృత్తి పరంగా వైశ్యులు వ్యాపారాన్ని ఎంచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా రోశయ్య ప్రస్తావించారు.