: శంభో శంకర.. నా కూతురు లక్ష్మీప్రసన్న మానస సరోవర యాత్ర విజయవంతం: మోహన్ బాబు
సినీనటుడు మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న మానస సరోవర యాత్రకు వెళ్లిందట. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్ బాబు ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. ‘నా కుమార్తె లక్ష్మీ ప్రసన్న మానస సరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది... వాట్సప్ లైవ్లో నాకు కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. శంభో శంకర..’ అని మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న సినిమాలు, టీవీ షోలల్లో రాణిస్తోన్న విషయం తెలిసిందే.