: బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ ఆల్టర్ కు అస్వస్థత


బోన్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు, అమెరికా సంతతికి చెందిన టామ్ ఆల్టర్ (67) ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టామ్ ఆల్టర్ కు బోన్ కేన్సర్ నాల్గో స్టేజ్ లో ఉంది. కాగా, టామ్ ఆల్టర్ అస్వస్థత విషయమై ఆయన కుమారుడు జెమీ ఆల్టర్ స్పందిస్తూ, తన తండ్రి అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని, అయితే, ఈ విషయమై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని అన్నారు.

 కాగా, ఇండియా షో బిజ్ ప్రోగ్రామ్ ద్వారా టామ్ ఆల్టర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. 2008 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. బాలీవుడ్ చిత్రాల్లో, టీవీ సిరీస్ ప్రోగ్రామ్స్ లో ఆయన నటించారు.

  • Loading...

More Telugu News