: వందేమాతరం ప‌లికే హ‌క్కు మ‌న‌కు ఉందా?... దేశప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌శ్న‌


భార‌తభూమిని చెత్త‌తో నింపే మ‌న‌కు `వందేమాతరం` అనే ప‌దాన్ని ఉచ్చరించే హక్కు ఉందా? అని దేశ‌ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌శ్నించారు. స్వామి వివేకానంద షికాగో స‌భ 125వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. `నేను ఇక్క‌డికి రాగానే అంద‌రూ వందేమాతరం పాడారు. నాకు చాలా ఆనందం వేసింది. కానీ వందేమాతరం పాడే హ‌క్కు మ‌న‌కు ఉందా? నేను దేశం మొత్తాన్ని ఈ ప్ర‌శ్న అడుగుతున్నాను` అని మోదీ ప్ర‌శ్నించారు.

`నా మాట‌లు కొంత‌మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ఆలోచించండి. నోట్లో పాన్ వేసుకుని, భార‌త‌భూమి మీద ఉమ్మేసే మ‌న‌కు, అదే నోటితో వందేమాతరం పాడే హ‌క్కు ఉందా?` అని ఆయ‌న అడిగారు. దేశ ప‌రిశుభ్ర‌త కోసం పాటుప‌డుతున్న వారికే వందేమాతరం ప‌లికే హ‌క్కు ఉంద‌ని ఆయ‌న తెలియజేశారు. విద్యార్థి ఎన్నిక‌ల ప్రచారంలో కూడా ప‌రిశుభ్ర‌త‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని మోదీ సూచించారు. ప్ర‌స్తుత స్థితిని బట్టే ప్ర‌పంచం భార‌త దేశాన్ని అంచ‌నా వేస్తుంద‌ని, 5000 ఏళ్ల క్రితం ప‌రిస్థితిని బ‌ట్టి కాద‌ని, అందుకే అన్ని ర‌కాలుగా భార‌త‌దేశ అభివృద్ధికి కృషి చేయాల‌ని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News