: కోహ్లీ బ్యాట్ ను ఉపయోగించకుండా నేనుండలేను: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి యాట్


ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ మహిళా జట్టులో సభ్యురాలు డానియెల్లి యాట్ ను క్రికెట్ అభిమానులు ఎవ్వరూ మరచిపోలేరు. ‘కోహ్లీ..నన్ను పెళ్లి చేసుకుంటావా? అనిసామాజిక మాధ్యమాల వేదికగా 2014లో తన మనసులో మాటను డానియెల్లి బయటపెట్టింది. తాజాగా, మరో ట్వీట్ చేసింది. ఈ వారం తిరిగి శిక్షణలో పాల్గొంటున్నానని, ఈ బ్యాట్ (కోహ్లీ కానుకగా ఇచ్చింది)ను ఉపయోగించేందుకు వేచి ఉండటం ఇక తన వల్ల కాదంటూ, కోహ్లీ కి తన కృతఙ్ఞతలు తెలిపింది.

 కాగా, యాషెస్ సిరీస్ కు డానియెల్లి తిరిగి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా కోహ్లీ తనకు కానుకగా ఇచ్చిన బ్యాట్ ను ఉపయోగించేందుకు ఆమె సిద్ధమవుతోంది. కాగా, 2014లో ఓ పర్యటన సందర్భంగా కోహ్లీ, డానియెల్లి కలుసుకున్నారు. ఆ సందర్భంలోనే కోహ్లీ ఓ బ్యాట్ ను డానియెల్లికి కానుకగా ఇచ్చాడు. ఈ ఫొటోను కూడా డానియెల్లి పోస్ట్ చేసింది.  

  • Loading...

More Telugu News