: అభివృద్ధికి అడ్డుపడేవారిని అడ్రస్‌ లేకుండా చేయాలి: ప్రజలకు చంద్రబాబు పిలుపు


రాష్ట్రంలో తాము జరుపుతోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కొంద‌రు అడ్డుపడుతున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అటువంటి వారిని అడ్రస్‌ లేకుండా చేయాలని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెట్టంగిలో ఈ రోజు చంద‌్రబాబు నాయుడు... ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తాను తెలుగు జాతి కోసం రాత్రింబవళ్లు కష్టపడతాన‌ని ఉద్ఘాటించారు. తాము ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుతున్నామ‌ని అన్నారు. రైతులకు రుణవిముక్తి కల్పించామ‌ని పేర్కొన్నారు. అలాగే, తాము చేప‌ట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు చోటులేదని చెప్పారు.

  • Loading...

More Telugu News