: వినాయకుడు మాంసం తింటున్నట్లుగా ఉన్న ప్రకటనపై కేసు వేసిన భారత ప్రభుత్వం
ఓ మాంసాహార కంపెనీ ప్రకటనలో ఇతర దేవుళ్లతో కలిసి హిందూ దైవం వినాయకుడు మాంసం తింటున్నట్లుగా చూపించడంపై భారత ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై ఆస్ట్రేలియా కోర్టులో ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన వివాదాల కింద కేసు వేసింది. కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రకటన కారణంగా భారత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.
ఈ మేరకు సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్, ప్రకటన రూపొందించిన `మీట్ అండ్ లైవ్‌స్టాక్ ఆస్ట్రేలియా` కంపెనీకి ప్రకటనను వెనక్కితీసుకోవాలంటూ నోటీసులు కూడా జారీచేసింది. వీరితో పాటు ఆస్ట్రేలియాలో ఉండే భారత కమ్యూనిటీ సంఘాలు కూడా ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. వీలైనంత త్వరగా ప్రకటన ప్రసారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో వినాయకుడితో పాటు జీసెస్, బుద్ధుడు, ఇతర గ్రీకు దేవతలు కూడా ఉన్నారు.